కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ ఆర్టీసీ కార్మికుల గేట్ ధర్నా
గద్వాల:-మణుగూరు డిపో కండక్టర్ ప్రవళ్లికపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంప్లాయిస్ యూనియన్ గద్వాల్ డిపో కార్మికులు సోమవారం గేట్ ధర్నా నిర్వహించారు. ప్రవళ్లికకు మెరుగైన వైద్యం అందించి, న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆమెను బస్సు నుంచి తోసివేసిన ప్రయాణికురాలిని వెంటనే అరెస్టు చేసి, నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రవళిక కు యాజమాన్యం 20 లక్షలు చెల్లించాలని నిబంధనల ప్రకారం కండక్టర్ ఉద్యోగం చేయలేని పక్షంలో ఓడి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరమేశ్వరయ్య , డిపో అధ్యక్షులు గాల్ రెడ్డి,...