Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రక్తదానం ప్రాణదానం తో సమానం.

Author
Posted By Telangana Vaartha
| 26 Oct 2026, 02:04 PM | తెలంగాణ Telangana
Video Thumbnail

అత్యవసర సమయంలో క్షతగాత్రులకు ఇది చాలా ఉపయోగం.
పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రక్తదానం కార్యక్రమం ఏర్పాటు.
సేవా కార్యక్రమాలలో పోలీసు ముందడుగు.
... నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.
పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థం ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ రక్తదాన శిబిరం నందు జిల్లా ఎస్పీ గారు పాల్గొని మొదటగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పి గారి వెంట DSP నరసింహ చారి, నాగారం సిఐ నాగేశ్వరరావు, సిఐ లు రామారావు, శివ కుమార్, ఆర్ఐ లు ప్రవీణ్, జానయ్య, ఎస్ఐ లు సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పౌరులు పాల్గొని వారి రక్తాన్ని దానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రజా సేవలో పోలీస్ ముందుంది అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశామన్నారు, జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఖమ్మంకు చెందినతల సేమియా, సికిల్ సెల్ సొసైటీ వారు వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం రక్తాన్ని సేకరించారు. పోలీసుల త్యాగాలు బలిదానాలను ప్రజలు గుర్తించాలని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలని ఎస్పి గారు విజ్ఞప్తి చేశారు. రక్తదానం ప్రాణదానమని ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు అత్యవసర సమయంలో ఎందరో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి పరిస్థితి రాకుండా అవసరమైన వారికి సరైన సమయంలో రక్తం అందాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్ద ఎత్తున యువత తరలివచ్చి రక్తదానం చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు. తలసేమియా పిల్లలకు ఉపయోగపడే విధంగా స్వచ్ఛంద సంస్థ వారు కూడా దాతల నుండి రక్తాన్ని సేకరించారు.
ఈ శిబిరం నందు పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ వారు కలిసి 150 మందికి పైగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, AR DSP నరసింహా చారి, డిసిఆర్బీ డిఎస్పీ రవి, సిఐ లు రాజశేఖర, నాగేశ్వరరావు, వెంకటయ్య, రామారావు, శివ కుమార్, ఆర్ఐ లు ప్రవీణ్ కుమార్, జానయ్య, పోలీసు సంఘం అధ్యక్షులు రమేష్, శంకర్ నాయక్, సెక్రెటరీ కిరణ్, సంఘం సభ్యులు, స్థానిక పౌరులు, సిబ్బంది పాల్గొన్నారు.

రక్తదానం ప్రాణదానం తో సమానం. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.