రక్తదానం ప్రాణదానం తో సమానం.

అత్యవసర సమయంలో క్షతగాత్రులకు ఇది చాలా ఉపయోగం. పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రక్తదానం కార్యక్రమం ఏర్పాటు. సేవా కార్యక్రమాలలో పోలీసు ముందడుగు. ... నరసింహ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థం ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ రక్తదాన శిబిరం నందు జిల్లా ఎస్పీ గారు పాల్గొని మొదటగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పి గారి వెంట DSP నరసింహ చారి, నాగారం సిఐ నాగేశ్వరరావు, సిఐ లు రామారావు, శివ కుమార్, ఆర్ఐ లు...