Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆర్యవైశ్యుల కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయడంతో పాటు అర్హులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి

Author
Posted By Telangana Vaartha
| 26 Oct 2026, 02:02 AM |
ఆర్యవైశ్యుల కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయడంతో పాటు అర్హులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి

ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్
ఖమ్మం:-
రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రాజకీయంగా, పరిపాలనా పరంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్ కోరారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు తగినన్ని నిధులు కేటాయించి పేద ఆర్యవైశ్యుల కు ఆర్థికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదుగురు ఆర్యవైశ్యులకు చైర్మన్ పదవులు కల్పించగా, ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క పదవి కూడా దక్కలేదని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ నిధుల కొరతతో పేద విద్యార్థులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన అర్హులైన ఆర్యవైశ్య కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని, ఇతర జిల్లాల్లోనూ అర్హులకు మరో రెండు, మూడు చైర్మన్ పదవులు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పసుమర్తి సీతా చంద్రరావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారని తెలిపారు. ఆర్యవైశ్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయడంతో పాటు అర్హులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని గుమ్మడవెల్లి శ్రీనివాస్ కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.