ఆర్యవైశ్యుల కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయడంతో పాటు అర్హులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి
ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్ ఖమ్మం:- రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రాజకీయంగా, పరిపాలనా పరంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్ కోరారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు తగినన్ని నిధులు కేటాయించి పేద ఆర్యవైశ్యుల కు ఆర్థికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదుగురు ఆర్యవైశ్యులకు చైర్మన్ పదవులు కల్పించగా, ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క పదవి కూడా దక్కలేదని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ నిధుల కొరతతో పేద విద్యార్థులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన అర్హులైన...