Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హాస్టల్ కి వచ్చిన విద్యార్థులను వెనక్కి తిరిగి పంపిస్తున్న సిబ్బంది

Author
Posted By Telangana Vaartha
| 25 Oct 2026, 06:40 PM | తాజావార్తలు Flash News
హాస్టల్ కి వచ్చిన విద్యార్థులను వెనక్కి తిరిగి పంపిస్తున్న సిబ్బంది

వార్డెన్ నిర్లక్ష్యం మూలంగా హాస్టల్లో విద్యార్థులు రావడం లేదు.

జోగులాంబ గద్వాల 25 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. పట్టణ కేంద్రంలోని హాస్టల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేద వర్గాల్లోని విద్యార్థులకు చదువుకోడానికి అన్ని వసతులతో ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేసింది. దసరా సెలవులకు వెళ్లిన విద్యార్థులు పాఠశాలలు పునర్ ప్రారంభమై మూడు రోజులు గడిచిన వచ్చినవిద్యార్థులను హాస్టల్లో ఉండనీయకుండా తిరిగి వెనక్కి ఇండ్లకు పంపడం ఎంతవరకు సమంజసం అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు సెలవులు పూర్తయి హాస్టల్కు వస్తే హాస్టల్ లోనే సిబ్బంది ఈరోజు ఆదివారం సెలవు కావడం వలన సోమవారం రోజు రాండి అని చెప్పడం వచ్చిన విద్యార్థుల ను తిరిగి వెళ్లిపోవడం అని చెప్పడంపై హాస్టల్ పై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులను ఉండనివ్వకుండా సిబ్బంది పంపడంతో కొంతమంది విద్యార్థులు తిరిగి వెళ్లిపోయారు. హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడం వలన వచ్చిన విద్యార్థుల ను పట్టించుకునే నాధుడే కరువాయాడనే విమర్శలు ఉన్నాయి. ఎస్సీ. బిసి. ఆనంద నిలయము హాస్టల్లోనూ సుమారు 600 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందినారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై మూడు రోజులు గడిచిపోయిన పాఠంశాలు నడుస్తున్న పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుల ను ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్న ఎస్సీ బీసీ ఆనంద నిలయం హాస్టల్లోనే వార్డెన్లకు చీమకుట్టినంత కూడా లేకపోవడం గర్వకారణం. జిల్లా కలెక్టర్ స్వయంగా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలు రప్పించండి అని చెప్పుతుంటే ఒకపక్క హాస్టల్ కి వచ్చిన విద్యార్థులను పట్టించుకోకపోవడం విద్యార్థులు ఉండలేక ఎవరు రాలేదు హాస్టల్ కానీ నేను ఒక్కని ఎందుకు ఉండాలని చెప్పి వచ్చిన విద్యార్థిలు తల్లిదండ్రులు వెంబడి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. నిత్యము తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లల్ని హాస్టళ్లకు రమ్మం నీ అని చెప్పడం హాస్టల్లో పర్యవేక్షణ అధికారి బాధ్యత. సెలవులు వచ్చినావంటే చాలు ఇండ్ల దగ్గర ఉండడం వాళ్లకు అలవాటుగా మారింది. ఇప్పటివరకు ఎస్సీ బీసీ ఆనందా నిలయం హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులు ఉండకపోవడంతో విద్యార్థులేఖ హాస్టల్ వెలవెలబోతుంది. విద్యార్థులకు తప్పిపోయిన పాఠంశాలు బోధనలు చెప్పే వారి దొరకని దుస్థితి ఏర్పడింది. సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద వర్గాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం యొక్క లక్ష్యము నీరు గారి పోతుందని చెప్పవచ్చు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.