Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

విద్యార్థుల హాజరు తప్పనిసరి - పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి

Author
Posted By A.Timma Gurudu
| 24 Oct 2026, 08:51 PM | Array
విద్యార్థుల హాజరు తప్పనిసరి - పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి

వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి - గణితం, సైన్స్ పై నిత్యం ప్రాక్టీస్.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.
ధరూర్. మండల పరిధిలోని రేవులపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు చదువులో రాణించి పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటే క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు.పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి వారి చదువు పురోగతిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా గణితం, సైన్స్ సబ్జెక్టులను ప్రతిరోజూ సాధన చేయాలని సూచించారు. ఉదయం లేవగానే కొంత సమయాన్ని చదువుకు కేటాయించి, నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవాలన్నారు.
పరీక్షలకు ఐదు నెలల సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదవాలని, సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజూ చదివిన పాఠాలను పునశ్చరణ చేయడంతో పాటు, నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేసి సమయపాలన అలవర్చుకోవాలని సూచించారు.
తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా తల్లిదండ్రుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వెనుకబడిన వారికి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం ధరించి పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించారు.
అంగన్వాడీల్లో నాణ్యమైన విద్య, పోషణ అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, విద్యా బోధన వివరాలను పరిశీలించారు.
పిల్లల భవిష్యత్తుకు పునాది అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్మితమవుతుందని, పిల్లలు క్రమం తప్పకుండా కేంద్రాలకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. శామ్, మామ్, స్టంటింగ్ సమస్యలు ఉన్న చిన్నారులను ముందుగానే గుర్తించి, ప్రత్యేక పోషకాహారం అందించి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో ధరూర్ తహసీల్దార్ నందిని, మండల విద్యాశాఖాధికారి రవీంద్ర బాబు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుమల్ రెడ్డి, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.