విద్యార్థుల హాజరు తప్పనిసరి - పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి
వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి - గణితం, సైన్స్ పై నిత్యం ప్రాక్టీస్. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.ధరూర్. మండల పరిధిలోని రేవులపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు చదువులో రాణించి పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటే క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు.పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి వారి చదువు పురోగతిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా...