Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తాగునీటి నాణ్యత పరీక్షలు నిరంతరం నిర్వహించాలి

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:50 PM | తాజావార్తలు Flash News
తాగునీటి నాణ్యత పరీక్షలు నిరంతరం నిర్వహించాలి

అక్రమ కనెక్షన్లపై చర్యలు.
ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 26 తెలంగాణ వార్తా ప్రతినిధి.ధరూర్. మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్ భగీరథ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.జిల్లా ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.నీటి శుద్ధి ప్రక్రియ, నాణ్యత పరీక్షలు, రసాయనాల వినియోగం, సిబ్బంది హాజరు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్, టర్బిడిటీ, క్లోరిన్ స్థాయిలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ముడి నీటి నాణ్యత ఆధారంగా జార్ టెస్టులు నిర్వహించి, అవసరమైన రసాయనాలను సరైన మోతాదులో వినియోగించాలన్నారు.
సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు
నీటి నాణ్యత పరీక్షలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీతో పాటు బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్లాంటులో సిబ్బంది హాజరును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, ఏజెన్సీ చూపిస్తున్న సిబ్బంది సంఖ్యకు, విధుల్లో ఉన్నవారి సంఖ్యకు వ్యత్యాసం లేకుండా చూడాలన్నారు. సిబ్బంది హాజరును పరిశీలించిన తర్వాతే ఏజెన్సీ బిల్లులు చెల్లించాలని సూచించారు. సిబ్బంది హాజరును 'మీ ప్రమాణం' యాప్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.
అక్రమ కనెక్షన్లపై ఉక్కుపాదం
నీటి సరఫరా సమయంలో అక్రమ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, నిబంధనల ప్రకారం నీటిని వినియోగించుకునేలా వివరించాలని సూచించారు. అక్రమ కనెక్షన్ల వల్ల ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, గుర్తించిన వెంటనే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ సంజీవ ప్రసాద్, ధరూర్ తహసీల్దార్ నందిని, ఇంజినీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.