తాగునీటి నాణ్యత పరీక్షలు నిరంతరం నిర్వహించాలి

అక్రమ కనెక్షన్లపై చర్యలు. ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 26 తెలంగాణ వార్తా ప్రతినిధి.ధరూర్. మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్ భగీరథ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.జిల్లా ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.నీటి శుద్ధి ప్రక్రియ, నాణ్యత పరీక్షలు, రసాయనాల వినియోగం, సిబ్బంది హాజరు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్, టర్బిడిటీ, క్లోరిన్ స్థాయిలను...