Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.. రూ.1.56 కోట్లు స్వాధీనం

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:42 PM | తాజావార్తలు Flash News
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.. రూ.1.56 కోట్లు స్వాధీనం

హైదరాబాద్, అక్టోబర్ 24:హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు.

అక్టోబర్ 22న హైదరాబాద్ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఎయిర్‌ఏషియా విమానం AK-68 ప్రయాణికులను ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో ఓ పురుష ప్రయాణికుడి ట్రాలీ బ్యాగులో దుస్తుల మధ్య దాచిన రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు. అనంతరం అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో మహిళను తనిఖీ చేయగా ఆమె వద్ద రూ.91.94 లక్షల విలువైన అమెరికన్ డాలర్లు లభించాయి.

ఇవి కూడా చదవండి

మొత్తం రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు.

విదేశీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? మలేషియాకు ఎందుకు తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
జోగులాంబ టీవీ – హైదరాబాద్

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.