శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.. రూ.1.56 కోట్లు స్వాధీనం

హైదరాబాద్, అక్టోబర్ 24:హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 22న హైదరాబాద్ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఎయిర్‌ఏషియా విమానం AK-68 ప్రయాణికులను ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ పురుష ప్రయాణికుడి ట్రాలీ బ్యాగులో దుస్తుల మధ్య దాచిన రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు. అనంతరం అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో...