Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం.. భజన మీడియాకు ప్రభుత్వ అక్రిడిటేషన్లా

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:39 PM | తాజావార్తలు Flash News
నిజమైన జర్నలిస్టులకు అన్యాయం.. భజన మీడియాకు ప్రభుత్వ అక్రిడిటేషన్లా

అర్హతలపై ప్రశ్నలు.. అక్రిడిటేషన్ విధానంపై సమాధానాలు చెప్పాల్సిందే!

ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందకపోవడం బాధాకరం.

ఏళ్ల తరబడి ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు గుర్తింపు లభించకపోతే.. అసలు అక్రిడిటేషన్ విధానం ఎవరి కోసం?

ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా భజన చేసే పత్రికలు, టీవీ ఛానళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అక్రిడిటేషన్ కార్డులు పొందిన వారి అర్హతలు ఏమిటి? వారి సంస్థలు ఎక్కడ ఉన్నాయి? క్షేత్రస్థాయిలో నిజంగా జర్నలిజం చేస్తున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై లేదా?

అక్రిడిటేషన్ అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చే బహుమతి కాదు.. నిబంధనల ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు కల్పించే గుర్తింపు.

కొత్తగా పేర్లు సృష్టించి, కొత్త వర్గీకరణలతో నిజమైన జర్నలిస్టులను పక్కనపెట్టి, అర్హతలపై స్పష్టత లేని వారికి కార్డులు జారీ చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి.

ప్రభుత్వం మారిన తర్వాత అక్రిడిటేషన్ నిబంధనల్లో వచ్చిన మార్పుల వెనుక ఉన్న కారణాలేంటి? ఐపీటీవీ, కేబుల్ టీవీ వంటి విభాగాలకు సంబంధించిన నిబంధనలు, వాటి అమలు విధానం ఏమిటి? ఏ నిబంధనల ప్రకారం కార్డులు జారీ చేస్తున్నారు? అర్హతలను ఎలా పరిశీలిస్తున్నారు?

ఇవి కూడా చదవండి

ఇవన్నీ ప్రజలకు, జర్నలిస్టులకు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత సమాచార, పౌర సంబంధాల శాఖపై ఉంది.

త్వరలో సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలు వెలుగులోకి!

ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డులు పొందిన మీడియా సంస్థల వివరాలు, వాటికి కార్డులు మంజూరు చేసిన ప్రమాణాలు, అర్హతల పరిశీలన, సంబంధిత నిబంధనల అమలు వంటి అంశాలపై సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు సేకరించనున్నాం.

నిజంగా అర్హతల ప్రకారమే కార్డులు ఇచ్చారా? నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేశారా? ఎక్కడైనా అక్రమాలు జరిగాయా? అనే ప్రశ్నలకు ఆధారాలతో సమాధానాలు వెలుగులోకి తీసుకొస్తాం.

తప్పు చేసినవారు ఎవరైనా సరే, ఆధారాలు బయటపడితే బాధ్యత వహించాల్సిందే. నిబంధనల ఉల్లంఘన జరిగితే సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి.

జర్నలిజం అంటే భజన కాదు.. ప్రశ్నించడం!
జర్నలిజం అంటే అధికారానికి వంగడం కాదు.. ప్రజల గొంతుకగా నిలబడటం!

నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరగాలి. నకిలీ జర్నలిజానికి అడ్డుకట్ట పడాలి. అక్రిడిటేషన్ వ్యవస్థలో పారదర్శకత రావాలి.

బి. గిరిబాబు సీఈఓ జోగులాంబ టీవీ. TWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.