నిజమైన జర్నలిస్టులకు అన్యాయం.. భజన మీడియాకు ప్రభుత్వ అక్రిడిటేషన్లా

అర్హతలపై ప్రశ్నలు.. అక్రిడిటేషన్ విధానంపై సమాధానాలు చెప్పాల్సిందే! ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందకపోవడం బాధాకరం. ఏళ్ల తరబడి ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు గుర్తింపు లభించకపోతే.. అసలు అక్రిడిటేషన్ విధానం ఎవరి కోసం? ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా భజన చేసే పత్రికలు, టీవీ ఛానళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అక్రిడిటేషన్ కార్డులు పొందిన వారి అర్హతలు ఏమిటి? వారి సంస్థలు ఎక్కడ ఉన్నాయి? క్షేత్రస్థాయిలో నిజంగా జర్నలిజం చేస్తున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై లేదా? అక్రిడిటేషన్ అంటే ప్రభుత్వానికి...