Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అర్వపల్లి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 24 Oct 2026, 09:25 AM | తెలంగాణ Telangana
అర్వపల్లి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

జాజిరెడ్డిగూడెం 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. పాలకమండలి చైర్మన్ గా బీరవోలు విక్రమ్ రెడ్డి మరియు 5 మంది సభ్యులతో ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటగా ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే మందుల సామెల్ చేతుల మీదుగా అధికారికంగా తమ బాధ్యతల స్వీకరించారు.
ఈ ప్రమాణస్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ
ఈ ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన దేవాలయంగా శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉందని తెలిపారు. గతంలో లాగా కాకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పాలకవర్గ సభ్యులకు సూచించారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఆలయ కమిటీ చైర్మన్ గా సేవ చేసే అవకాశం రాదని అన్నారు. పదవీకాంక్షతో కాకుండా సేవా దృక్పథంతో ఉండాలని కోరారు.
నూతన కమిటీ చైర్మన్ బీరవోలు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయానికి సుమారు 750 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. రాష్ట్రంలోనే చిన్నగట్టు జాతరగా పేరుగాంచిందని తెలిపారు. ఈ దేవాలయాన్ని చిన్న యాదగిరిగుట్టగా పేరుగాంచిందని అన్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి పదములో నడిపి పూర్వ వైభవం తీసుకొస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి, అర్వపల్లి సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు వేల్పుల రమేష్, గ్రంధాలయ చైర్మన్ బైరబోయిన వేణు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, ఎన్ ఎస్ యు ఐ విభాగం, మహిళా కాంగ్రెస్ విభాగం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.