అర్వపల్లి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
జాజిరెడ్డిగూడెం 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. పాలకమండలి చైర్మన్ గా బీరవోలు విక్రమ్ రెడ్డి మరియు 5 మంది సభ్యులతో ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటగా ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే మందుల సామెల్ చేతుల మీదుగా అధికారికంగా తమ బాధ్యతల స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్...