Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

టిబీ రహిత సమాజానికి కృషి చేయాలి

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 08:42 PM | తాజావార్తలు Flash News
టిబీ రహిత సమాజానికి కృషి చేయాలి

టిబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి
జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి ఆరాధన పట్నాయక్
దేశవ్యాప్తంగా టీబీ నిర్మూలనపై చేపట్టే కార్యక్రమాలపై జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య, ఎన్సీసీ అధికారులతో సమన్వయ సమావేశం
టిబీ రహిత సమాజానికి కృషి చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి ఆరాధనా పట్నాయక్ అన్నారు.
శుక్రవారం న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎన్సీసీ అధికారులతో దేశవ్యాప్తంగా టీబీ నిర్మూలనపై చేపట్టే కార్యక్రమాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి ఆరాధన పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి (టిబీ) నిర్మూలనకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టి, టిబీ రహిత గ్రామాల సంఖ్యను పెంచాలన్నారు.
టిబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తూ క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో దీర్ఘకాలిక దగ్గు, తదితర టిబీ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి వెంటనే సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో జోష్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజల్లో టిబీ లక్షణాలున్న వారిని గుర్తించే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. ఈ బృందాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, యువ క్రీడాకారులు , మై భారత్ వాలంటీర్లను భాగస్వాములను చేసి ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. టిబీ బాధితులకు పౌష్టికాహారం అందించడం కూడా వ్యాధి నియంత్రణలో కీలకమని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, దాతలు, వివిధ సంస్థల సహకారంతో టిబీ బాధితులకు పోషకాహార కిట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శిరీష, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, సంబంధిత డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, ఎన్సిసి అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారిచేయనైనది

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.