Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

CEC జ్ఞానేశ్ కుమార్ ని తక్షణమే విధుల నుండి తొలగించాలి

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 08:40 PM | తాజావార్తలు Flash News
CEC జ్ఞానేశ్ కుమార్ ని తక్షణమే విధుల నుండి తొలగించాలి

SIR నిలిపివేసి తొలగించిన ఓటర్లను తక్షణమే నమోదు చేయాలి......ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా పాత బస్టాండు వైయస్సార్ చౌరస్తా లో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేసి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను రద్దు చేయాలని అలాగే అక్రమంగా తొలగించిన ఓటర్లను తక్షణమే నమోదు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ కేవలం బిజెపి లబ్ధి కోసం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేశ పౌరుల ఓట్లను అక్రమంగా తొలగించే ప్రక్రియకు పాల్పడుతున్నాడని దీని ద్వారా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరుస్తూ దేశ సార్వభౌమత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడని ఇప్పటికే సుప్రీంకోర్టు కలగజేసుకొని కేవలం ఓటు నమోదుకు సంబంధించిన పని మాత్రమే మీరు చేయాలని పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం మీకు లేదని చెప్పిన కూడా వాటిని పెడచెవిన పెడుతూ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళుతున్న పరిస్థితి ఉందని ఇది దేశానికి దేశ పౌరసత్వానికి ప్రమాదం అని దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమ పోరాటం జరుగుతున్న కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చేత రాజీనామా చేయించి ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసి స్వయం ప్రతిపత్తి సంస్థగా నడిచే విధంగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని రాబోయే రోజుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థల విధ్వంసం పౌర హక్కుల రాజ్యాంగంపై దాడి వీటి రక్షణ కొరకు ప్రజలందరూ సంఘటితమై ఉద్యమాలకు రావాలని ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతంగ సమితి రాష్ట్ర కార్యదర్శి గోపాల్ యాదవ్ తెలంగాణ రైత్ సంగం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి ప్రజాఫంటు నాయకులు శంకర్ ప్రభాకర్ బహుజన రాజ్యసమితి నాయకులు నాయకులు వినోదు పి వై ఎల్ నాయకులు దానయ్య బి ఆర్ ఎస్ వి నాయకులు కురువపల్లయ్య సిపిఐ ఆశన్న సిఐటియు జిల్లా కార్యదర్శి వి వి నరసింహ

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.