Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బడికి డుమ్మా కొడితే కుదరదు.. హాజరుపై కలెక్టర్‌ ఫోకస్‌

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 08:37 PM | తాజావార్తలు Flash News
బడికి డుమ్మా కొడితే కుదరదు.. హాజరుపై కలెక్టర్‌ ఫోకస్‌

పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువులపై ఆరా

గద్వాల: దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంపై జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ దృష్టి సారించారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువుల పరిస్థితిని తెలుసుకున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, యూనిఫాంతో రావాలని విద్యార్థులకు సూచించారు.

సెలవులకు ముందు ఇచ్చిన అసైన్‌మెంట్లను పూర్తి చేసి ఉపాధ్యాయులకు అందించాలని, చదువులో వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థులు బడికి రాకపోతే వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హాజరు ప్రాధాన్యతను వివరించాలని ఉపాధ్యాయులకు చెప్పారు.

అనంతరం పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. దాతల సహకారంతో నిర్మించిన స్టేజీ షెడ్‌ను చూశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి

ఈ పర్యటనలో మండల విద్యాధికారి శ్రీనివాస్‌ గౌడ్‌, తహసీల్దార్‌ హరికృష్ణ, ప్రధానోపాధ్యాయురాలు రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.