బడికి డుమ్మా కొడితే కుదరదు.. హాజరుపై కలెక్టర్‌ ఫోకస్‌

పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువులపై ఆరా గద్వాల: దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంపై జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ దృష్టి సారించారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువుల పరిస్థితిని తెలుసుకున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, యూనిఫాంతో రావాలని విద్యార్థులకు సూచించారు. సెలవులకు ముందు ఇచ్చిన అసైన్‌మెంట్లను పూర్తి చేసి ఉపాధ్యాయులకు అందించాలని, చదువులో వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థులు బడికి రాకపోతే వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హాజరు ప్రాధాన్యతను వివరించాలని ఉపాధ్యాయులకు...