Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వైద్య ఆరోగ్యశాఖ పోస్టులకు 24న అర్హత పరీక్షలు,27న వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 08:35 PM | తాజావార్తలు Flash News
వైద్య ఆరోగ్యశాఖ పోస్టులకు 24న అర్హత పరీక్షలు,27న వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షలు, వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం హాజరుకావాలని సూచించారు.వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీన అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ (సీఎన్సీయూ& యెన్ టీ ఈ పీ) పోస్టులకు ఉదయం 10:00 గంటల నుంచి 10:30 గంటల వరకు,మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు మధ్యాహ్నం 1:00 గంటల నుంచి 1:30 గంటల వరకు,స్టాఫ్ నర్స్ పోస్టులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:00 గంటల వరకు, ఏఎన్‌ఎం పోస్టులకు సాయంత్రం 4:00 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పోస్టులకు కేటాయించిన సమయాన్ని గమనించి, నిర్ణీత సమయానికి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
అదేవిధంగా, పల్లె దవాఖానల్లో పనిచేసేందుకు ఏం ఎల్ పీహెచ్ /సి హెచ్ ఓ /ఏంఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఎంబీబీఎస్ /బీఏఎంఎస్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీన ఉదయం 10:30 గంటలకు వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు గద్వాల పట్టణంలోని ఐడీఓసీ భవనం మొదటి అంతస్తులో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, ఎఫ్ -30లో నిర్వహించబడతాయని వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులు తమ శాఖాధిపతి నుంచి పొందిన నిరభ్యంతర పత్రం తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఏం ఎల్ పీహెచ్ /సి హెచ్ ఓ /ఏంఓ (పల్లె దవాఖాన), ఫిజీషియన్, ఫిజియోథెరపిస్ట్, ఓబీజీ స్పెషలిస్ట్, పీజీ అర్హత కలిగిన ఆయుష్ వైద్యులు,డైటీషియన్, సైకోసోషల్ కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ లాబొరేటరీ సూపర్‌వైజర్ తదితర పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాలను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేర్లు,దరఖాస్తు వివరాలు మరియు మెరిట్ జాబితాలోని సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి ధృవీకరించుకోవాలని సూచించారు.అభ్యర్థులు పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయ్యే ముందు సంబంధిత సూచనలను జాగ్రత్తగా చదివి, అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్షలు, ఇంటర్వ్యూల తేదీలు, సమయాలు, మెరిట్ జాబితాలు మరియు ఇతర వివరాల కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను https://gadwal.telangana.gov.in/ సందర్శించాలని సూచించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.