వైద్య ఆరోగ్యశాఖ పోస్టులకు 24న అర్హత పరీక్షలు,27న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి అర్హత పరీక్షలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం హాజరుకావాలని సూచించారు.వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీన అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ (సీఎన్సీయూ& యెన్ టీ ఈ పీ) పోస్టులకు ఉదయం 10:00 గంటల నుంచి 10:30 గంటల వరకు,మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులకు మధ్యాహ్నం 1:00 గంటల నుంచి 1:30 గంటల వరకు,స్టాఫ్ నర్స్ పోస్టులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి...