Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జోగులాంబ సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్.

Author
Posted By A.Timma Gurudu
| 19 Oct 2026, 06:56 PM | Array
జోగులాంబ సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్.

జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి. అలంపూర్ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 9వ రోజు అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కుటుంబ సభ్యులతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ సోమవారము దర్శించుకున్నారు. ఆలయ ఈవో దీప్తి రెడ్డి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో న్యాయమూర్తికి, ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు.అనంతరం జస్టిస్ ఎన్.హరినాథ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించారు.దసరా శరన్నవరాత్రుల పవిత్ర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తి,ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు సంప్రదాయ ప్రకారం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి మిథున్ తేజ ఆలంపూర్ ఆలయ ఈ.ఓ దీప్తి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.