జోగులాంబ సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్.

జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి. అలంపూర్ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 9వ రోజు అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కుటుంబ సభ్యులతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ సోమవారము దర్శించుకున్నారు. ఆలయ ఈవో దీప్తి రెడ్డి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో న్యాయమూర్తికి, ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు.అనంతరం జస్టిస్ ఎన్.హరినాథ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించారు.దసరా శరన్నవరాత్రుల పవిత్ర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తి,ఆయన కుటుంబ...