Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాం

Author
Posted By Telangana Vaartha
| 19 Oct 2026, 06:43 PM | తాజావార్తలు Flash News
తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాం

-జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు
-ఖమ్మంలో ఘనంగా జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని, తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేనను నిలబెడతామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం వేడుక ఖమ్మం జిల్లా కేంద్రంలోని గట్టయ్య సెంటర్ ప్రాంతంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అత్యంత ఘనంగా జరిగింది. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, సాంప్రదాయ పద్ధతిలో రిబ్బన్ కట్ చేసి కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు చేతుల మీదుగా జనసేన జెండా ఆవిష్కరించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం పనిచేయనుందని డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కోటి అప్పారావ్, దుంపటి శ్రీనివాస్, రాము యాదవ్, మిర్యాల రామకృష్ణ, మిరియాల జగన్ మోహన్, బండారు రామకృష్ణ, యాసంనేని అజయ్ కృష్ణ, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, హసీనా, తాళ్లూరి డేవిడ్, ఆంగోతి శ్రీను, తుడుం ఉత్తం రాజ్ , సచ్చు స్రవంతి కన్నా, శివరాత్రి రమణ కుమార్, సాయి కుమార్, గంజి ఉదయ్, మామిడి ఉదయ్, నాగరాజు, రాజేంద్రప్రసాద్, బద్రి, బాలరాజు, తుమ్మలపూడి గంగాధర్, కొమ్ము అచ్యుత్, హనుమంతు మౌనిక, దేవేందర్, వెంకన్న, హనుమంతు సాయి కృష్ణ, మద్ది సాయికుమార్, కొమ్ము లక్ష్మి, భరత్, ఆనంద్, రాకేష్, వంశీ, పుల్లారావు, దుర్గాప్రసాద్, నరేష్, హరి, శ్రీకాంత్, నిర్మల, విజయలక్ష్మి ఫయాజ్, బాణాల శ్రీకాంత్, రచ్చ నాగరాజు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జనసేనలో చేరికలు
ఖమ్మంలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకులు గంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 మందికి పైగా కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి మామగారు శ్రీ కోటి అప్పారావ్ జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి అహ్వానించారు. రాజేష్, శ్యామ్, మల్లయ్య, సందీప్, పుల్లారావు, సాయి, సుందర్, ఫరీద్, అరుణ్ కుమార్, ప్రసాద్, ఆనంద్, రవితేజ, బీమా, నరేష్, సందీప్, ప్రవీణ్, గణేష్, మోహన్, రంగా, ప్రభు దీవెన, ప్రమోద్ కుమార్, బాలు, మోహన్, వెంకట్, శంకర్, చంద్రశేఖర్, కిషన్ నాయక్, కృష్ణ చంద్ర, ఏడుకొండలు, సతీష్, లీలా, పద్మ వేణు, సాయి, శ్రావణ్, శ్రీనివాస్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.