తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాం
-జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు -ఖమ్మంలో ఘనంగా జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని, తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేనను నిలబెడతామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం వేడుక ఖమ్మం జిల్లా కేంద్రంలోని గట్టయ్య సెంటర్ ప్రాంతంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ,...