Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బతుకమ్మ గొప్పతనాన్ని విచ్చిన్నం చేసిన బతుకమ్మ ఏర్పాట్లు

Author
Posted By Telangana Vaartha
| 19 Oct 2026, 06:28 PM | తాజావార్తలు Flash News
బతుకమ్మ గొప్పతనాన్ని విచ్చిన్నం చేసిన బతుకమ్మ ఏర్పాట్లు

- బతుకమ్మ ఔన్నత్యాన్ని దెబ్బ తీయడాన్ని అసహ్యించుకుంటున్న మహిళలు
- పేటలో బతుకమ్మ ఏర్పాట్లపై మండిపడ్డ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ

సూర్యాపేట, అక్టోబర్ 19 : గత పదేళ్ళలో ఎన్నడు లేని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఏర్పాట్లు తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మగౌరమైన బతుకమ్మ గొప్పతనాన్ని విచ్చిన్నం చేశాయని బతుకమ్మ వద్ద బతుకమ్మ ఔన్నత్యాన్ని దెబ్బ తీసేలా ప్రైవేట్ పాటలు వేయడం పట్ల మహిళలు అసహ్యించుకుంటున్నారని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలొ ఆమె మాట్లాడుతూ తెలంగాణాలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని, మనో దైర్యాన్ని పెంచుతూ పోరాట పటిమను పెంచిన గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. అలాంటి బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర సాధకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా గుర్తించి మహిళలకు కానుకగా ఇచ్చాడన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వన్నె తెస్తూ ఖండంతరాలకు విస్తరించిన బతుకమ్మ ఏర్పాట్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళలను నిరాశ పర్చాయన్నారు. బతుకమ్మ ఏర్పాట్లు చేయడంలో మహిళలకు వసతులు కల్పించడంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గం పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు అద్భుతమైన బతుకమ్మ ఘాట్ను నిర్మించి ప్రతి యేటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో బతుకమ్మ ఉత్సవాలను నీరుగార్చేలా ప్రైవేట్ పాటలు వేయడంతో పాటు లైట్లు, సౌండ్స్ లేకుండా మహిళలను నిరాశ పర్చారన్నారు. బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసేందుకు కనీసం సిబ్బందిని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బతుకమ్మ అంటే నచ్చదని అందుకే కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మను ఉంచి మహిళల్లో దైర్యం నింపితే రేవంత్రెడ్డి అదే చేతిలో బతుకమ్మను తీసి కంకి పెట్టాడని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంచినీటి సమస్యతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, దోమల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ హాయంలో మాజీ మంత్రి జగదీష్రెడ్డి పదేళ్ళలో అద్భుతమైన అభివృద్ది చేస్తే మూడేళ్ళ కాంగ్రెస్ పాలన 60 యేళ్ళ కిందటి వినాశనాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు పాలకవర్గాలు ఏ ఉత్సవం చేసినా తమ ప్లెక్సీల ఏర్పాట్లకు ప్రాదాన్యం ఇవ్వకుండా ప్రజల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ మెరుగైన ఏర్పాట్లు చేయాలని ముందు ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ పోతురాజు ఇందుశ్రీ, మహిళా నాయకురాళ్ళు ఎస్.కె. సల్మామస్తాన్, సారంగుల కరుణశ్రీ, కల్లెపల్లి మహేశ్వరి, ఢిల్లీ పావని, భవాని తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.