బతుకమ్మ గొప్పతనాన్ని విచ్చిన్నం చేసిన బతుకమ్మ ఏర్పాట్లు

- బతుకమ్మ ఔన్నత్యాన్ని దెబ్బ తీయడాన్ని అసహ్యించుకుంటున్న మహిళలు - పేటలో బతుకమ్మ ఏర్పాట్లపై మండిపడ్డ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ సూర్యాపేట, అక్టోబర్ 19 : గత పదేళ్ళలో ఎన్నడు లేని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఏర్పాట్లు తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మగౌరమైన బతుకమ్మ గొప్పతనాన్ని విచ్చిన్నం చేశాయని బతుకమ్మ వద్ద బతుకమ్మ ఔన్నత్యాన్ని దెబ్బ తీసేలా ప్రైవేట్ పాటలు వేయడం పట్ల మహిళలు అసహ్యించుకుంటున్నారని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలొ ఆమె మాట్లాడుతూ తెలంగాణాలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని, మనో దైర్యాన్ని పెంచుతూ...