Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల ఆరోగ్య పరిరక్షణ

Author
Posted By A.Timma Gurudu
| 19 Oct 2026, 06:00 PM | తెలంగాణ Telangana
అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల ఆరోగ్య పరిరక్షణ

శరన్నవరాత్రుల సందర్భంగ అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల ఆరోగ్య పరిరక్షణ కొరకు కొనసాగుతున్న ప్రథమ చికిత్స కేంద్రం.
జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- డీఎంహెచ్వో - డా. సంధ్యా కిరణ్మయి ఆదేశాల మేరకు శరన్నవరాత్రుల సందర్భంగ అలంపూర్‌లోని ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి విచ్చేస్తున్న భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగ అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అలంపూర్‌కు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైన తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఈ కేంద్రం ద్వార సేవలు కొనసాగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన ప్రథమ చికిత్స, ప్రాథమిక ఆరోగ్య పరిక్షలు, అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వైద్య సిబ్బందితో పాటు (108) వాహనం అందుబాటులో ఉంటుంది. ఎండ, రద్దీ, అలసట, నీరసం, తల తిరగడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు భక్తులు ప్రథమ చికిత్స కేంద్రాన్ని సంప్రదించి వైద్య సేవలు పొందవచ్చు. అవసరమైన సందర్భాల్లో బాధితులకు తదుపరి వైద్య చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, పండుగకు వచ్చే ప్రతి ఒక్కరికి సకాలంలో వైద్య సేవలు అందేల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. భక్తులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగ ఉండాలని, ఏవైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండ సమీపంలోని ప్రథమ చికిత్స కేంద్రాన్ని సంప్రదించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల ఆరోగ్య పరిరక్షణ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.