Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గోపా ఆధ్వర్యంలో గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 11:14 PM | తాజావార్తలు Flash News
గోపా ఆధ్వర్యంలో గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం

ది. 18-10-2026 న ఖమ్మం జిల్లా గోపా ఆధ్వర్యంలో గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం ఖమ్మం నగరంలో ఉన్న లైన్స్ క్లబ్ భవనంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా పొందాలని తద్వారా పిల్లల భవిష్యత్తు కోసం కష్టాన్ని కూడా ఇష్టం చేసుకుని తీవ్రంగా శ్రమించే తల్లిదండ్రులకు మేలు చేయాలని తలంపు కలుగుతుందని, తల్లిదండ్రులకు సేవ చేసే పనిని బాధగా కాకుండా బాధ్యతా అని తెలుసుకొనే అవకాశం కలుగుతుందని దీనివలన తల్లిదండ్రులు చివరి దశలో కూడా పిల్లలను ఆశీర్వదిస్తారని ఇవన్నీ జరగాలంటే విజ్ఞానంతో పాటు సంస్కారం కూడా చాలా అవసరం అని విద్యార్థిని విద్యార్థులకు బోధించారు.
వచ్చే సంవత్సరానికి ఖమ్మం జిల్లా గోపా ఆధ్వర్యంలో జరగబోయే గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఖచ్చితంగా ఖమ్మంలో నిర్మిస్తున్న గౌడ్ కమ్యూనిటీ హాల్లో జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ గౌడ్ విద్యార్థిని విద్యార్థులు చదువులలో రాణించాలని భవిష్యత్తులో ఉపాధి ఉద్యోగాలు పొంది ఉన్నత స్థానం పొందాలని, విద్య ద్వారా వివేకం చైతన్యం మరియు జీవితం పై అవగాహన కలుగుతుందని జీవితంలో ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలుగుతాయని విద్య ద్వారా ఒక్క ఉపాధి కాకుండా అన్ని రంగాలపై పట్టు సాధించవచ్చని, పుట్టిన చోట కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా బ్రతకవచ్చని, తలవంచుకొని పుస్తక పఠనం చేసినట్లయితే జీవిత కాలం నందు తల ఎత్తి బ్రతకవచ్చని ఇది ఒక్క చదువులో ఉన్నదని కాబట్టి గౌడ్ విద్యార్థినీ విద్యార్థులు జీవితంలో చదువు పట్ల 20 సంవత్సరాలు ఏకాగ్రత ప్రదర్శిస్తే జీవితకాలం అంతయు సుఖసంతోషాలతో బ్రతకవచ్చని విధ్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గోపా ప్రధాన కార్యదర్శి శ్రీ GVS శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ గోపా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రతిభ పురస్కారాల కార్యక్రమం నిరంతరంగా నిర్విరామంగా జరుగుతున్నాయని, విద్యార్థిని విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కనబరిచి ఉన్నత స్థానాలు పొందాలని తామంతా గ్రామీణ ప్రాంతం ఉండే వచ్చామని, చదువు విషయంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలనే భేదం ఉండదని, గౌడ్ విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో లక్ష్యం వైపు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గౌడ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా గోపాల ద్వారా ప్రతి సంవత్సరం గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని తద్వారా విద్యార్థిని విద్యార్థులు చదువులలో నైతిక మద్దతు ఇచ్చినట్లు అవుతుందని, అనే వృత్తులలో ఉన్న గౌడ సామాజిక వర్గం తమ తోటి వారికి సహాయం అందించడానికి ముందుకు రావాలని అటువంటి వారికి గోపా ఒక వేదికగా ఉంటుందని తెలియజేశారు.
కోప అంటే పరస్పర పరిచయం మరియు పరస్పరం సహకరించుకొవడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖమ్మం జిల్లా గోపా ప్రధాన కార్యదర్శి బొలగాని శ్రీనివాసరావు గౌడ్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలలో ప్రతిభ చాటినందుకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు చదువుని ఇష్టంతో చదువుకోవాలని తద్వారా జ్ఞానం పొంది కార్యాచరణ కోసం పనిచేసే వివేకం వస్తుందని సమాజంలో ఎలా మెలగాలో తెలుస్తుందని తద్వారా భవిష్యత్తుకు మంచి పునాది పడుతుందని, విద్యాభ్యాసం సమయంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ వాటిని విజయాలుగా మలుచుకొని లక్ష్యం వైపు ప్రయాణం చేయాలని, ముఖ్యంగా గౌడ్ విద్యార్థినిలు చదువుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ స్నేహం విషయంలో ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలని తద్వారా లక్ష్యానికి ఎలాంటి ఆటంకాలు కలగవని, తల్లిదండ్రుల కలలు నిజం కావాలంటే కష్టపడాల్సి ఉంటుందని అది మీ భవిష్యత్తుకే ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు తమ తల్లిదండ్రుల యొక్క ఉపాధి పనులలో అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు సహాయకారిగా ఉంటే చదువుతోపాటు కులవృత్తుల పట్ల అవగాహన పెరుగుతుందని భవిష్యత్తులో చదువు ద్వారా కనీస ఉపాధి పొందనప్పుడు అనాదిగా వస్తున్నా వృత్తి ద్వారానైనా జీవనం గడపటానికి అవకాశం ఏర్పడుతుందని తల్లిదండ్రులకు కూడా కొంత ఉపశమనం అందించిన వారు అవుతారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఖమ్మం జిల్లా గోపా కోశాధికారి గండు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ గౌడ్ విద్యార్థిని విద్యార్థులు అందరూ చదువులలో రాణించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘంనాయకులు అమరగాని వెంకన్న గౌడ్, అడ్వకేట్స్ బిచ్ఛాల తిరుమల్ రావు గౌడ్, నల్లమాస కృష్ణ గౌడ్,తెలంగాణ రాష్ట్ర గొపా ఉపాధ్యక్షులు గుడిద శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం జిల్లా తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు కత్తి నెహ్రూ గౌడ్, కట్టెకోల వెంకన్న గౌడ్, చిత్తలూరి నరసయ్య గౌడ్, బండి నాగేశ్వరరావు గౌడ్, పోలంపల్లి నాగరాజుగౌడ్, మాదా శ్రీరాములు గౌడ్, పుల్లయ్య గౌడ్, బోడపట్ల సుదర్శన్ గౌడ్, డాక్టర్ శివాజీ గౌడ్, డాక్టర్ గోపగాని శ్ సురేందర్ గౌడ్, ఖమ్మం గోపా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ బొల్లికొండ దర్గయ్య గౌడ్, మారగని నారాయణ గౌడ్, టేకుమట్ల హుస్సేన్ గౌడ్, తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్, కొండి కుమారస్వామి గౌడ్, గొల్లపల్లి రత్నం గౌడ్, కొత్త వెంకటేశ్వర్లు గౌడ్, ముత్యం రామకృష్ణ గౌడ్, పామర్తి నాగేశ్వరావు గౌడ్, మంద ప్రసాద్ గౌడ్, బొమ్మకంటి రామకృష్ణ గౌడ్ తదితరులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

గోపా ఆధ్వర్యంలో గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.