గోపా ఆధ్వర్యంలో గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం
ది. 18-10-2026 న ఖమ్మం జిల్లా గోపా ఆధ్వర్యంలో గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం ఖమ్మం నగరంలో ఉన్న లైన్స్ క్లబ్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా పొందాలని తద్వారా పిల్లల భవిష్యత్తు కోసం కష్టాన్ని కూడా ఇష్టం చేసుకుని తీవ్రంగా శ్రమించే తల్లిదండ్రులకు మేలు చేయాలని తలంపు కలుగుతుందని, తల్లిదండ్రులకు సేవ చేసే పనిని బాధగా కాకుండా బాధ్యతా అని తెలుసుకొనే అవకాశం కలుగుతుందని దీనివలన తల్లిదండ్రులు చివరి దశలో కూడా పిల్లలను ఆశీర్వదిస్తారని ఇవన్నీ జరగాలంటే విజ్ఞానంతో...