Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణ సంస్క్రతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 11:05 PM | తాజావార్తలు Flash News
తెలంగాణ సంస్క్రతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

- సూర్యాపేట పెరిక భవన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఆడి పాడి సందడి చేసిన మహిళా మణులు
సూర్యాపేట, అక్టోబర్ 18 :
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్క్రతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని సూర్యాపేట పట్టణ పెరిక సంఘం అధ్యక్షులు పత్తిపాక వేణుధర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి వెంట ఉన్న సూర్యాపేట పెరిక భవన్లో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించి మాట్లాడారు. బతుకమ్మ గొప్పతనాన్ని భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి బతుకమ్మ వేడుకలను పెరిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి యేటా ఇదే మాదిరిగా బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం మహిళా మణులు రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి గౌరమ్మను పూజిస్తూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు. అనంతరం సమీప చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. గౌరమ్మ అందరిని చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం మహిళలు పత్తిపాక వీరమ్మ, పోతురాజు సుజాత, పిన్నేని అనిత, పత్తిపాక ప్రమీల, జూకూరి గీత, ధన్యాకుల సరిత, పిన్నని అనిత, అంకతి ఉపేంద్ర, జుట్టుకొండ నాగలక్ష్మి, బందు మమత, దన్యాకుల రజిత, పిన్నని వసంత లక్ష్మిలు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్క్రతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.