తెలంగాణ సంస్క్రతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

- సూర్యాపేట పెరిక భవన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు - ఆడి పాడి సందడి చేసిన మహిళా మణులు సూర్యాపేట, అక్టోబర్ 18 : తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్క్రతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని సూర్యాపేట పట్టణ పెరిక సంఘం అధ్యక్షులు పత్తిపాక వేణుధర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి వెంట ఉన్న సూర్యాపేట పెరిక భవన్లో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించి మాట్లాడారు. బతుకమ్మ గొప్పతనాన్ని భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి బతుకమ్మ వేడుకలను పెరిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి...