Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ముందు ధర్నా

Author
Posted By Kadem Ravi
| 18 Oct 2026, 08:34 PM | తెలంగాణ Telangana
ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ముందు ధర్నా

ముఖ్యమైన పాయింట్స్:

  • టీవీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మహారాజ్ ఆధ్వర్యంలో

హైదరాబాద్ 18 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న ఏదైతే బతుకమ్మ దాండియా పేరుతోటి దాదాపు 3వేల మంది విద్యార్థులు దగ్గర డబ్బులు వసూలు చేసి కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేని వస్తువుల వల్ల లైటింగ్ స్క్రీన్ వల్ల నాణ్యత లోపం వల్ల లైటింగ్ ఒక్కసారిగా మీద పడి అక్కడికక్కడే సోనా అనే విద్యార్థిని మృతి చెందడం జరిగింది.తన సోదరీ మీనాకు కూడా తీవ్రమైన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతున్నది కోమాలోకి వెళ్లడం జరిగింది. విషయం తెలుసుకొని శనివారం రోజు కళాశాల దగ్గరికి వెళితే వందలాది పోలీసులు అడ్డుకున్నారు.ఇలా విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలు అవినీతికి పాల్పడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎంవీఎస్ఆర్ కళాశాల మీద గత కొన్ని రోజుల క్రితమే హైర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ కి ఫిర్యాదు చేశాము ఎలాంటి స్పందన లేకుండా విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారు.ఎంఎస్ఆర్ చైర్మన్ మరియు ఎంవిఎస్ఆర్ ట్రెజరర్ గా చలామణి అవుతున్న దొంగనా అవినీతిపరుడు మేడి ప్రభాకర్ వీరి పైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కోరుతున్నాము.అలాగే ఏదైతే నిన్న దాండియా నృత్యంలో చనిపోయిన సోనా కుటుంబానికి విద్యార్థికి ఐదు కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా యజమాన్యం ప్రకటించాలి. దాదాపు 25 మంది విద్యార్థినీ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి వాళ్లకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎంవీఎస్ఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే నిన్న జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత యం.వి.ఎస్.ఆర్ పూర్తి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ MVSR ఇంజనీరింగ్ కళాశాల ఖబర్దార్ ఖబర్దార్ .. ఏదైతే మేడి ప్రభాకర్ అనే దొంగ అవినీతిపరుడు అక్రమ అవినీతిపరుడు అని ఎన్నో ఆరోపణలు అవినీతి ఎదుర్కొంటున్న సందర్భంలో అతనిపై ఈడి ఇన్కమ్ టాక్స్ ఏసీబీ రైడ్లు చేసే అక్రమ ఆస్తులను గుర్తించాలని చెప్పి కోరుతున్నాము...

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.