Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 12:58 AM | తాజావార్తలు Flash News
గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులో విషాద ఘటన జరిగింది.
10వ వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతుల కుమారుడు రాఘవ. హైదరాబాద్ లో ఒక కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులకు రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. ఇంటి వద్దకు రావడంతో తల్లి "నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి" అంటూ మంచంపై కూర్చుంటూనే కింద పడిపోయాడట. వెంటనే CPR చేసి, ఆటోలో వైరాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించి గుండెపోటుతో మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. చాలా చిన్న వయసులో గుండెపోటు రావడం నిజంగా బాధాకరం.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.