గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులో విషాద ఘటన జరిగింది. 10వ వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతుల కుమారుడు రాఘవ. హైదరాబాద్ లో ఒక కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులకు రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. ఇంటి వద్దకు రావడంతో తల్లి "నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి" అంటూ మంచంపై కూర్చుంటూనే కింద పడిపోయాడట. వెంటనే CPR చేసి, ఆటోలో వైరాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించి గుండెపోటుతో మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. చాలా చిన్న వయసులో గుండెపోటు రావడం నిజంగా బాధాకరం.