Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వెంకటేశ్వర దేవాలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Author
Posted By Telangana Vaartha
| 17 Oct 2026, 11:04 PM |
వెంకటేశ్వర దేవాలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

కోరుట్ల కోరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శనివారం ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పోరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ లు విచ్చేశారు ఈసందర్బంగా జగిత్యాల జిల్లా దేవాదాయ ఇన్స్పెక్టర్ రాజమౌలి నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ముఖ్య అతిథి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ వెంకటేశ్వర దేవాలయ నూతన అధ్యక్షులు కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్ష కార్యవర్గ సభ్యులు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు అనంతరం కోరుట్ల పట్టణ బస్టాండ్ రోడ్ లో గల హనుమాన్ దేవాలయం నూతన కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు త్వరలోనే వారి ప్రమాణ స్వీకారం ఉంటుందని జువ్వాడి నర్సింగరావు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుప్పాల ప్రభాకర్ అన్నం అనిల్ ఆడెపు మధు జిందం లక్ష్మీనారాయణ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎతిరాజం నర్సయ్య కార్యవర్గ సభ్యులు నేతి శ్రీనివాస్ కటుకం దివాకర్ కోట గంగాధర్ గోడికే రాములు చిలువేరి విజయ్ చిట్యాల పద్మ ఆలయ ఈవో ఎం విక్రమ్ జూనియర్ అసిస్టెంట్ పేడిపల్లి నర్సయ్య ఆలయ ప్రధానార్చకులు బీర్నంది నర్సింహ చారి పలువురు పట్టణ ప్రముఖులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.