Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఐటీడీఏ పీవో బి రాహుల్ మరియు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట.

Author
Posted By Telangana Vaartha
| 17 Oct 2026, 11:01 PM |
ఐటీడీఏ పీవో బి రాహుల్ మరియు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట.

తెలంగాణ వార్త అక్టోబర్ 17 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:- ఐటీడీఏ మరియు డివిజన్ పరిధిలోని ఆదివాసి గిరిజన గ్రామాలలో గిరిజన కుటుంబాలకు ముఖ్యంగా గిరిజన మహిళలకు, ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట శనివారం నాడు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ అనేది చాలా పవిత్రమైన పండుగని బతుకమ్మ వేడుకలు ప్రారంభమైన రోజు నుండి ప్రతిరోజు మహిళలు వివిధ అలంకరణలతో వివిధ రూపాలతో బతుకమ్మలను తయారుచేసి చిన్న పెద్ద అందరు కలిసి చాలా సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మల ఆటలు ఆడి ఒకరినొకరు సంతోషాన్ని పంచుకుంటారని చివరి రోజు తిరోక్క పువ్వులతో బతుకమ్మను చేసి ఊరంతా ఒకచోటికి చేరి గౌరమ్మను పూజించుకునే గొప్ప పండుగని,సద్దుల బతుకమ్మ ను తయారుచేసి అందరూ ఒకచోట గుమిగూడి ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఊరేగింపుతో బతుకమ్మలను నిమజ్జనం చేసి సంతోషంగా గడుపుతారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో వివిధ శాఖలలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.