ఐటీడీఏ పీవో బి రాహుల్ మరియు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట.

తెలంగాణ వార్త అక్టోబర్ 17 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:- ఐటీడీఏ మరియు డివిజన్ పరిధిలోని ఆదివాసి గిరిజన గ్రామాలలో గిరిజన కుటుంబాలకు ముఖ్యంగా గిరిజన మహిళలకు, ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట శనివారం నాడు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ అనేది చాలా పవిత్రమైన పండుగని బతుకమ్మ వేడుకలు ప్రారంభమైన రోజు నుండి ప్రతిరోజు మహిళలు వివిధ అలంకరణలతో వివిధ రూపాలతో బతుకమ్మలను తయారుచేసి చిన్న పెద్ద అందరు కలిసి చాలా సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మల ఆటలు ఆడి ఒకరినొకరు...