Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పండుగ వేళ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Author
Posted By Telangana Vaartha
| 17 Oct 2026, 05:11 PM | Array
పండుగ వేళ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • - పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మేనేజర్ కిషన్ ముషం

సూర్యాపేట, అక్టోబర్ 17 :- దసరా పండుగ వేళ పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు సైబర్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్యాంట్ మేనేజర్ కిషన్ ముషం అన్నారు. శనివారం పట్టణంలోని ఎంజీ రోడ్డు శాఖ కార్యాలయంలో ఖాతాదారుల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, సైబర్ మోసాల నివారణ, భద్రతా చర్యలపై తమ ఖాతాదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే పండుగల వేళ ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ళు మోసపూరిత మెసేజ్‌లు, ఆకర్షణీయమైన నకిలీ ఆఫర్‌ల పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, ఖాతాదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్వతహాగా ఖాతా బ్లాక్ చేసుకునే సులువైన మార్గం

బ్యాంకు ఖాతాదారుల భద్రత కోసం ప్రవేశపెట్టిన నూతన సౌకర్యాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా ఖాతాదారుడు తమ ఖాతా సైబర్ దాడికి/మోసానికి గురైందని భావిస్తే, వెంటనే ఖాతాలోని సొమ్ము సురక్షితంగా ఉంచడానికి స్వతహాగా తమ ఖాతాని నిలిపివేసే (బ్లాక్ చేసే) వెసులుబాటును బ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపా. ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి బ్లాక్ <ఖాతా సంఖ్య చివరి 5 అంకెలు> అని టైప్ చేసి 9512002051 నంబర్‌కు SMS పంపడం ద్వారా తక్షణమే తమ ఖాతాను స్వయంచాలకంగా బ్లాక్ చేసుకోవచ్చనీ తెలిపారు. అలా బ్లాక్ చేసిన తదుపరి రోజున ఖాతాదారులు నేరుగా బ్యాంకును సంప్రదించి, సరియైన ఆధార పత్రాలు సమర్పించి తమ ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోవచ్చని తెలిపారు. అనంతరం ఆపరేషనల్ మేనేజర్ శ్రీకాంత్ కోట మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఆఫర్ల ఎస్ ఎం ఎస్ లు, వాట్స్ యాప్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ (పిన్) లేదా కార్డు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు గుడుగుంట్ల విద్యాసాగర్, గజ్జల కృష్ణా రెడ్డి, చామకూరి శ్రీనివాస్, ఎల్లు నారాయణ రెడ్డి, గుగులోతు మంగమ్మ, బొమ్మిడి కృపాకర్, శాఖ సిబ్బంది బోనగిరి కవిత, గోపనబోయిన నరేష్, వూటుకూరి శృతి, గుంటి సైదులు, నారాబోయిన రాము, ఖాతా దారులు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.