Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఏపూరి ఎర్ర సూర్యుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్.

Author
Posted By Telangana Vaartha
| 17 Oct 2026, 04:29 PM | తెలంగాణ Telangana
ఏపూరి ఎర్ర సూర్యుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్.

ముఖ్యమైన పాయింట్స్:

  • 18 వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు.

ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు. ఏపూరి ఎర్ర సూర్యుడు. ఎం సిపిఐ వ్యవస్థాపకులు. అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఎక్స్ ఎమ్మెల్యే గారి 18వ వర్ధంతి ఈరోజు కామ్రేడ్ ఎస్కే నజీర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ ఎంపీ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడి ఆ పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో కలిసి పది లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచిన చరిత్ర ఓంకార్ గారిది ఐదుసార్లు నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ప్రజల సమస్యల గురించి రెండున్నర గంటలు అనార్దళంగా మాట్లాడి అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసుల హక్కుల కోసం అనగారిన కులాల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తాను మరణించేంతవరకు సామాజిక న్యాయం కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేశారని వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమములో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లింగంపల్లి పంచాయతీ రాజ్ చందుపట్ల పవన్ కళ్యాణ్, నాయకులు గోపగాని లింగయ్య, వైభవ్ బండి శబరి, లక్ష్మణ్, శ్రీను, రాములు, తదితరులు, పాల్గొన్నారు.

ఏపూరి ఎర్ర సూర్యుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.