Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం..

Author
Posted By Telangana Vaartha
| 16 Oct 2026, 06:33 PM | తెలంగాణ Telangana
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం..

ముఖ్యమైన పాయింట్స్:

  • పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వివిధ పోటీలు..

విద్యార్థులు, యువత, పౌరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఎస్పీ కె.నరసింహ.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు.
1. విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు..
తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 500 పదాలకు మించకుండా వ్యాసం రాయాలి. చివరి తేదీ: 28-10-2026.
ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అంశాలు:..
1. సైబర్ నేరాల నివారణలో పోలీసుల, పౌరుల పాత్ర.
2. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు మాదకద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండాలి?
డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు అంశాలు:.
1. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర.
2. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర.
ఆసక్తి గల విద్యార్థులు https://forms.gle/YkeKUscWu5LFYWFH7 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, తమకు నచ్చిన భాషలో కాగితంపై వ్యాసం రాసి, ఫొటో లేదా PDF రూపంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. మూడు భాషల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారు.
2. పోలీసు సిబ్బందికి ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు..
తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 500 పదాలకు మించకుండా వ్యాసం రాయాలి. చివరి తేదీ: 27-10-2026
ఎస్‌ఐ, ఆపై స్థాయి అధికారులకు అంశాలు:
1. ప్రజల మన్ననలు, గౌరవం పొందేందుకు పోలీసులు చేయాల్సిన కృషి.
2. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం.
కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి సిబ్బందికి అంశాలు:.
1. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఆశించే సేవలు.
2. పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర, దాని వ్యసనాన్ని అధిగమించి వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకునే విధానం.
పాల్గొనేవారు తమ పేరు, హోదా, ఇతర వివరాలతో https://forms.gle/F7BcALuk23jDXBcL6 లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని, వ్యాసాన్ని ఫొటో లేదా PDF రూపంలో అప్‌లోడ్ చేయాలి.
3. షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు.
తెలంగాణ రాష్ట్ర పౌరులు పోలీసు సేవలు, ప్రజా భద్రత, నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, పోలీసు అమరవీరుల త్యాగాలు వంటి అంశాలపై గరిష్ఠంగా మూడు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించి పోటీల్లో పాల్గొనవచ్చు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌లను సమర్పించవచ్చు. అలాగే పోలీస్ ప్రతిభ చూపే రీసెంట్ ఫొటోస్ సమర్పించవచ్చు. చివరి తేదీ: 30-10-2026 యూనిట్ స్థాయిలో ఉత్తమ మూడు షార్ట్ ఫిల్మ్‌లను, మూడు ఫొటోలను ఎంపిక చేసి, రాష్ట్రస్థాయి ఎంపిక కోసం పంపిస్తారు. ఎంపికైన వారికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తారు.
షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీల రిజిస్ట్రేషన్ లింక్:
https://forms.gle/gVpPmmWFrWZNNRBF6
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలీసు శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను ప్రదర్శించాలని, పోలీసు సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, ప్రజలు పోలీసు శాఖకు సంబంధించిన అంశాలపై తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించే అన్ని పోటీలు, కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపీఎస్ కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.