Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బాలెంల గ్రామ స్టేజి వద్ద రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పి నరసింహ

Author
Posted By Telangana Vaartha
| 16 Oct 2026, 04:35 PM | తెలంగాణ Telangana
బాలెంల గ్రామ స్టేజి వద్ద రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పి నరసింహ

- మార్నింగ్ వాక్ సురక్షిత ప్రాంతాల్లో చేయాలి.
- జాతీయ రహదారులపై, ఆర్ అండ్ బి రహదారులపై మార్నింగ్ వాక్ ప్రమాదం.
... సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ.

ఈరోజు తెల్లవారు జామున సూర్యాపేట రూరల్ పరిది జనగామ హైవే పై బాలెంల గ్రామ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్పి నరసింహ పరిశీలించారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడినారు. గ్రామానికి చెందిన నాగరాజు, సైదులు, జానయ్య అనే ముగ్గురు వ్యక్తులు తెల్లవారు జామున రోడ్డు పై వాకింగ్ చేస్తుండగా వెనుక నుండి డీసీఎం వాహనం తలిగినది. ఈ ఘటనలో నాగరాజు, సైదులు అక్కడే మృతిచెందారు. జానయ్య ను మెరుగైన చికిచ్చ కోసం హైదరాబాద్ తరలించారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నందు చేశారు, డీసీఎం డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అనేది పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని, డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థలాన్ని డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్, స్థానిక ఎస్ఐ అనిల్ రెడ్డి తో కలిసి ఎస్పి నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఉదయం వేళల్లో మార్నింగ్ వాక్ చేసే వారు జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ రహదారులు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై నడవకూడదని సూచించారు. మైదానాలు, పార్కుకులు, అందుబాటులో ఉన్న వెంచర్స్ లాంటి సురక్షితమైన ప్రదేశాల్లోనే నడక సాగించాలని అన్నారు. రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా వాహనాల రాకపోకలను గమనించి జాగ్రత్తగా దాటాలని తెలిపారు. రహదారుల పక్కన ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రమాద సూచిక బోర్డులు, బ్లాక్ స్పాట్లు, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు:
- ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి.
- అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం మానుకోవాలి.
- డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదు.
- పొగమంచు, తక్కువ వెలుతురు ఉన్నప్పుడు వేగాన్ని తగ్గించి, తగినంత దూరం పాటించాలి.
- అలసటగా ఉన్నప్పుడు లేదా నిద్రమత్తులో ఉన్నప్పుడు వాహనాలు నడపకూడదు.
- వాహన సామర్థ్యానికి మించి లోడుతో ప్రయాణించకూడదు.
- ఇతర వాహనదారుల తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలి.

సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “ARRIVE ALIVE” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. రోడ్డు నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. తొందరపాటు కంటే ప్రాణం ముఖ్యమని, కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచూస్తుంటారని గుర్తుంచుకుని సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.

బాలెంల గ్రామ స్టేజి వద్ద రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పి నరసింహ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.