Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా అమలు

Author
Posted By Telangana Vaartha
| 15 Oct 2026, 10:21 PM |
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా అమలు

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా అమలు చేసి, బాధితులకు సత్వరన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి
....... జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Suryapet:- జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (PCR & POA Act) అమలు, బాధితులకు అందాల్సిన న్యాయం, పరిహారం మరియు సహాయక చర్యల పై గురువారం కలెక్టరేట్ వీసీ హాల్ నందు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (DVMC) సమీక్షా సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (PCR & POA Act) అమలు, బాధితులకు అందాల్సిన న్యాయం, పరిహారం మరియు సహాయక చర్యల పై, బాధితులకు చెల్లించిన నష్టపరిహారం (ఎక్స్ గ్రేషియా) సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ బాధితులకు పునరావాసం కల్పించడం, ప్రభుత్వ పథకాలను వారికి అనుసంధానించడం, మరియు స్పెషల్ కోర్టులలో ఉన్న కేసుల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చట్టాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా అమలు చేసి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లా ఎస్పీ కె.నరసింహ సూర్యాపేట,కోదాడ డిఎస్పీలతో తో కలిసి జిల్లాలో పెండింగ్లో ఉన్న POA చట్టం కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, మరియు కోర్టు ప్రొసీడింగ్స్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని కమిటీకి నివేదించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, ఎస్సీ సంక్షేమ అధికారి లత, ఇ డి ఎస్సీ కార్పొరేషన్ ఉపేందర్ రావు, సూర్యాపేట హుజూర్నగర్ కోదాడ ఆర్డీవోలు వేణుమాధవ్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, సిపిఓ కిషన్, గిరిజన సంక్షేమ అధికారి పార్థసారథి, జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, డిఎస్ఓ మోహనబాబు, కమిటీ సభ్యులు & స్వచ్ఛంద సంస్థలు: కమిటీ నాస్-అఫీషియల్ సభ్యులు గల్లా వెంకటేశ్వర్లు, పల్లె శ్రీనివాసరావు, బాదావత్ జయ, కంపటి శ్రీనివాస్, పోతుల జ్ఞానయ్యలతో పాటు NGO ప్రతినిధులు కొత్త సరిత వెంకట్ రెడ్డి, డి. మధనాచార్య, శారద తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.