Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మొదటి అలైన్ మెంట్ కొనసాగించాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 15 Oct 2026, 08:49 PM | తెలంగాణ Telangana
మొదటి అలైన్ మెంట్  కొనసాగించాలి

తిరుమలగిరి 16 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ బుల్లెట్ ట్రైన్ నిర్మించే అంతవరకు ఉద్యమం ఆగదు అని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు తిరుమలగిరి మండల కేంద్రంలో తెలంగాణ యువజన సంఘము కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడుతూ సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారి డార్ & స్టేషన్ ఏర్పాటు చేయాలనీ కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సుమారు 80 రోజులకు పైగా వివిధ పోరాట రూపాలలో ఉద్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నిరేత్తనట్లు ఉంది అని, కేంద్ర ప్రభుత్వం శంషాబాద్ నుండి చెన్నైవరకు సూర్యాపేట మీదుగా ప్రకటించిన మొదటి అలైన్ మెంట్ నే కొనసాగించాలని, సూర్యాపేట ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాలని డిమాండ్ చేసారు.రెండు తెలుగు రాష్టాల రాజధానుల మధ్య అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు అవుతే, సూర్యాపేట ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు పై కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసారు.63 రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రం లో అఖిల పక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని,సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అఖిల పక్షం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించటం జరిగింది అని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొదటి అలైన్ మెంట్ మార్చే కుట్రలు జరుగుతున్న, సూర్యాపేట లో 80 రోజులకు పైగా అఖిల పక్షం ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతున్న జిల్లా మంత్రి స్పందించక పోవడం శోచనీయం అన్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ యువజన సంఘము సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోరెళ్ల విప్లవ్ కుమార్, తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ గఫార్ ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీపంగు సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిగా సంతోష్ రెడ్డి, హరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.