Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మాలిపురం అంగన్వాడి కేంద్రంలో చోరీ

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 15 Oct 2026, 08:30 PM | తెలంగాణ Telangana
మాలిపురం అంగన్వాడి కేంద్రంలో చోరీ

తిరుమలగిరి 16 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మాలిపురం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో చోరీ జరిగింది దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో ఇదే అదునుగా భావించిన దోపిడీదారులు అంగన్వాడి కేంద్రాన్ని ఎంచుకొని రాత్రిపూట అగత్యానికి పాల్పడ్డారు గురువారం నాడు అంగన్వాడి కేంద్రానికి కోడిగుడ్లు పంపిణీ చేస్తుండడంతో అంగన్వాడి కేంద్రానికి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి పెద్దపెద్ద కట్టెలతో వెనుక నుండి కిటికీలను పూర్తిగా ధ్వంసం చేసి నూనె ప్యాకెట్లు 16 పాల ప్యాకెట్లు 15 బాలామృతం ప్యాకెట్లు 15 కేజీలు 6 ప్యాకెట్లు దొంగలించినట్లు అంగన్వాడీ టీచర్ చంద్రకళ వెల్లడించారు ఈ విషయంపై పై అధికారులకు సమాచారం అందించిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి

మాలిపురం అంగన్వాడి కేంద్రంలో చోరీ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.