Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు త్వరలోనే పనులు ప్రారంభం

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 15 Oct 2026, 08:24 PM | తెలంగాణ Telangana
విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు త్వరలోనే పనులు ప్రారంభం

తిరుమలగిరి 16 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రభుత్వం ప్రతిపాదించిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు ఇటీవల ప్రభుత్వం మంజూరు చేయడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం గురువారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 98 ఒక ఎకరం విస్తీర్ణం లో నిర్మించేందుకు విద్యుత్ అధికారులు తొండ గ్రామానికి విచ్చేసి గ్రామ పంచాయతీ కి పంచనామ పత్రం అందించి భూమిని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏఈ గిరిబాబు మాట్లాడుతూ త్వరలోనే సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేపట్టి పనులు ప్రారంభం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసరావు ,లైన్మెన్ ఎల్లగౌడ్ ,బుచ్చిమల్లు ,ఆర్ ఐ జార్జి రెడ్డి ,గ్రామ సర్పంచ్ స్వాతి, మహేష్ ,సోమయ్య ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు త్వరలోనే పనులు ప్రారంభం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.