విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు త్వరలోనే పనులు ప్రారంభం
ప్రభుత్వం ప్రతిపాదించిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు ఇటీవల ప్రభుత్వం మంజూరు చేయడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం గురువారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 98 ఒక ఎకరం విస్తీర్ణం లో నిర్మించేందుకు విద్యుత్ అధికారులు తొండ గ్రామానికి విచ్చేసి గ్రామ పంచాయతీ కి పంచనామ పత్రం అందించి భూమిని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏఈ గిరిబాబు మాట్లాడుతూ త్వరలోనే సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేపట్టి పనులు ప్రారంభం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసరావు ,లైన్మెన్ ఎల్లగౌడ్ ,బుచ్చిమల్లు ,ఆర్ ఐ జార్జి రెడ్డి ,గ్రామ సర్పంచ్ స్వాతి, మహేష్ ,సోమయ్య ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు