Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్

Author
Posted By Telangana Vaartha
| 13 Oct 2026, 07:22 PM | తాజా సమాచారం
ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్

రూ.20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్..!
లేఅవుట్ క్లియరెన్స్ రిపోర్ట్ కోసం రూ.30 లక్షల డిమాండ్.. రూ.20 లక్షలకు బేరం తహశీల్దార్ సుదర్శన్ రెడ్డితో పాటు చిక్కిన మండల సర్వేయర్ శ్రీనివాసులు
ఏకకాలంలో ఇళ్ళు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు.. పట్టుబడిన భారీ నగదు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ బోడ సుదర్శన్ రెడ్డి, మండలసర్వేయర్ బటుక శ్రీనివాసులు ఓ..రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి రూ.20 లక్షల భారీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.30 లక్షల డిమాండ్.. రూ.20 లక్షలకు డీల్!
ఒక ప్రైవేట్ భూమికి సంబంధించిన లేఅవుట్ అప్రూవల్ కోసం ఉమ్మడి తనిఖీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ రిపోర్టును క్లియర్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు తహశీల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు కలిసి సదరు బాధితుడిని రూ.30 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు బతిమాలడంతో, చివరకు రూ.20 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ విషయమై అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం పక్కావ్యూహంతో నిఘా పెట్టింది. తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ శ్రీనివాసులు ద్వారా కెమికల్ పూసిన రూ.20 లక్షల నగదును తహశీల్దార్ సుదర్శన్ రెడ్డి అందుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మాత్తుగా దాడి చేశారు. అధికారులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారి చేతులకు జరిపిన రసాయన పరీక్షల్లో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఇళ్ళు, ఆఫీసుల్లో ముమ్మర సోదాలు!
తహశీల్దార్, సర్వేయర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందాలు.., అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయంతో పాటు హైదరాబాద్, వరంగల్ లోని వారి నివాసాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. సుదర్శన్ రెడ్డి గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో, ఆయనకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.