Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆకలిని తరిమికొట్టి.. న్యాయం వైపు విజయం సాధించడమే ఎస్‌డీపీఐ లక్ష్యం

Author
Posted By Telangana Vaartha
| 13 Oct 2026, 06:40 PM | Array
ఆకలిని తరిమికొట్టి.. న్యాయం వైపు విజయం సాధించడమే ఎస్‌డీపీఐ లక్ష్యం

ప్రజాస్వామ్యంలో భయం లేకుండా ప్రజలంతా సమానంగా ముందుకు సాగాలి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ షా
సూర్యాపేట జిల్లా కేంద్రం:
ఆకలిని తరిమికొట్టి, న్యాయం వైపు విజయం సాధించడమే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ప్రధాన లక్ష్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఆశయాలు, లక్ష్యాలు, ప్రజల్లో పార్టీని మరింత విస్తరించాల్సిన అవసరంపై మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం ఉండాలని ఆయన అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ హక్కుల కోసం ముందుకు సాగాలని పేర్కొన్నారు. సమాజంలో న్యాయం, సమానత్వం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ప్రజలను చైతన్యపరుస్తూ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడమే పార్టీ కార్యకర్తల ప్రధాన బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ షా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఫన్ భాయ్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు ముఫ్తీ అస్రార్ నోమానీ, పార్టీ సభ్యులు షేక్ మస్తాన్, షేక్ సలీం, షేక్ నబీ, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.